తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ప్రాజెక్టులలోకి కూడా భారీగా నీరు చేరడంతో తెలంగాణలో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా భారీ వర్షాలతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అన్న భయం కూడా నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా యాదాద్రి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారి ఆ కొండచరియలు విరిగి పడటంతో ఆ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డులోని రెండో ఘాట్ లో బండరాళ్ళు విరిగిపడ్డాయి.  అయితే ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాళ్లు విరిగిపడటంతో ప్రస్తుతం కొండపైకి రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: