సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉప ఎన్నిక‌లు ఉంటేనే ఆ ప్రాంతంపై కేసీఆర్ దృష్టి పెడ‌తార‌ని ఆమె ఆరోపించారు. కేసీఆర్‌ది ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని ఒప్పుకున్నందుకు సంతోషమ‌ని...ఎన్నిక‌ల్లో గ‌ట్టేక్కేందుకు త‌ప్పా కేసీఆర్‌కి ప్ర‌జ‌ల అభివృద్దిమీద ప‌ట్టింపులేదనన్నారు. జ‌నాల‌ను మోసం చేస్తున్నాం అని చెప్పి ఒప్పుకున్నారని ఆమె తెలిపారు.తెలంగాణ ప్ర‌జ‌లు ఇప్ప‌టికైనా  ఆలోచించాల‌ని...ఎన్నిక‌లు ఉంటేనే ప‌థ‌కాలు వ‌స్తాయని ఆమె పేర్కొన్నారు.ఎన్నిక‌లు వ‌స్తేనే మీ ప్రాంతాలు అభివృద్ది జ‌రుగుతాయని...మీ ప్రాంతం అభివృద్ది జ‌ర‌గాలంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను రాజీనామాలు చేయించండని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.ఉప ఎన్నిక‌లు వ‌స్తేనే మీ ప్రాంతంపై కేసీఆర్ దృష్టి ప‌డుతుందని...ఎన్నిక‌ల్లో గెలిచేందుకు కొత్త ప‌థ‌కాలు తెస్తారు..గెలిచాక మూల‌న ప‌డేస్తారని ష‌ర్మిల తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో ప్ర‌వేశ పెడుత‌న్న మ‌రో కొత్త ప‌థ‌కం ద‌ళిత‌బందుని అక్క‌డి నుంచే ప్రారంభించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు.అయితే ఈ ప‌థ‌కం అక్క‌డి నుంచే ప్రారంభించ‌డానికి ఉప ఎన్నిక‌లే కార‌ణ‌మ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: