ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక అన్న విషయం తెలిసిందే. తాజాగా వీటికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. గుంపులుగుంపులుగా నివసించే కృష్ణ జింకలను మనం పార్క్ లోనో, అడవిలోనే ఉన్న చూస్తాము. కానీ చాలా తక్కువ సంఖ్యలో... ఈ వీడియోలో లో ఏకంగా 3000 కృష్ణజింకలు కనిపించడం ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. గుజరాత్ లోని భావ్ నగర్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్ లో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. దాదాపు 3000 కృష్ణజింకలు ఒకేసారి రోడ్డు దాటుతూ కనిపించాయి. 

దానిని గుజరాత్ ఇన్ఫర్మేషన్ అని ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఎక్సలెంట్' అంటూ కామెంట్ చేశారు. పచ్చిక బయళ్ళలో అలా చెంగు చెంగున ఎగురుతూ వరుసగా వెళ్తున్న కృష్ణ జింకలను చూసి నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ఈ వీడియోకు భారీ సంఖ్యలో రిట్వీట్స్, లైక్స్ లభిస్తున్నాయి. సాధారణంగా చాలా జంతువులు అంతరించి పోతున్నాయంటూ జంతు ప్రేమికులు వాపోతుంటారు. అందులో కృష్ణ జింకలు కూడా ఉన్నాయి. కానీ ఈ వీడియో మాత్రం శుభ పరిణామం అన్పిస్తోంది.  




మరింత సమాచారం తెలుసుకోండి: