మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు మారిపోయాడు. ఇంతకుముందులా సీరియస్ గా కాకుండా లవర్ బాయ్ గా మారిపోయాడు. తాజాగా విశ్వక్ హీరోగా నటించిన "పాగల్" థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్‌లో విశ్వక్ సేన్ 1600 మంది అమ్మాయిలను ప్రపోజ్ చేసే అసాధారణమైన పాత్రలో కన్పించాడు. హీరోయిన్ రూపంలో తన సోల్ మేట్ దొరికే వరకూ ఇలా లవ్ యాత్రను కొనసాగించాడు. ఈ ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్, మ్యూజిక్ యూత్ దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. విశ్వక్ సేన్ సరికొత్త పాత్రలో కన్పించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామా కామెడీ, లవ్, ఎమోషనల్ భావోద్వేగాల సమ్మేళనం అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ హీరోయిన్లుగా నటించారు. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తో నరేశ్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమైంది. దిల్ రాజు సమర్పణలో బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్న "పాగల్" ఈ నెల 14న రిలీజ్ కానుంది. "పాగల్" ట్రైలర్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: