తెలుగు సినీ ఇండస్ట్రీలో లో అభిరుచి కలిగిన నిర్మాతగా దిల్ రాజు కి మంచి పేరుంది. ఆయన సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే నమ్ముతారు సినీ వర్గాల వారు. అయితే చాలా క్యాలిక్యులేటర్ గా సినిమాలు చేసే దిల్ రాజు కూడా అప్పుడప్పుడు బోల్తా పడుతూ ఉంటాడు అనుకోండి అది వేరే విషయం. అయితే ఆయన కొత్త హీరోల ను లాంచ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో వారసత్వం అనేది కూడా చాలా కామన్ అయిపోతున్న ఈ రోజుల్లో దిల్ రాజు తన వారసుడిని హీరోగా దింపుతున్నాడు. ఇప్పటికే తమ్ముడి కుమారుడు హీరోగా ఒక సినిమా నడుస్తూ ఉండగా ఇప్పుడు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. కొత్త దర్శకుడు హరీష్ కానుగంటి దర్శకత్వంలో రౌడీ బాయ్స్ అనే పేరుతో ఈ సినిమా  తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితం అధికారికంగా విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: