కాకినాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడం సంచలనంగా మారింది, అక్టోబర్ 5 న అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌ను పదవి నుంచి దిపేందుకు అన్ని పార్టీల కార్పొరేటర్లు ఏకమయ్యారని అంటున్నారు, మేయర్ సుంకర పావని పై 33 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. మేయర్ సుంకర పావని తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాగా ఆమెపై అవిశ్వాసం పెట్టిన వారిలో ఎక్కువ మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ వారే కావడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చక్రం తిప్పి అందరినీ కూడగట్టి మేయర్‌ను పదవి నుంచి దించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది, నిబంధనల ప్రకారం ఆమెను పదవి నుంచి దించేందుకు సమయం కలసి రావడంతో 33మంది కార్పొరేటర్లు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి  కలెక్టర్ సి. హరికిరణ్ కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందించారు, ఈ క్రమంలో కాకినాడలో కార్పొరేటర్లకు అధికారులు నోటీసులు జారీ చేయగా, నోటీసులు తీసుకోకూడదని టీడీపీ మేయర్ పావని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: