చెత్తకుప్పల్లో పడేసిన కాలం చెల్లిన చాక్లెట్లు తిన్న మూడు ఆవులు కడుపు ఉబ్బ‌డంతో మృతిచెందాయి. సేలం జిల్లా మేట్టూరు కోంబ్రాన్‌ కాటు ప్రాంతానికి చెందిన పరమన్‌ -జయమ్మాళ్‌ దంపతులు త‌మ ఉపాధి కోసం నాలుగు ఆవులను పెంచుతున్నారు. వీరక్కల్‌పుదూర్‌ పట్టణ పంచాయతీ పరిధిలో ఉన్న శ్మశానంలో స్థానికులు ప్ర‌తిరోజూ అక్క‌డ చెత్త వేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం  కాలం చెల్లిన చాక్లెట్లను గుర్తుతెలియని వ్యక్తులు పడేయ‌డంతో మేతకు వెళ్లిన ఆవులు అవి తిన్నాయి. సాయంత్రం ఇంటికి చేరుకున్న ఆవుల్లో మూడు ఆవులు కడుపు ఉబ్బి మృతిచెంద‌డంతో ప‌ర‌మ‌న్‌, జ‌య‌మ్మాళ్ దంప‌తులు శోకిస్తున్నారు. త‌మ జీవ‌నోపాధి వాటిపైనే ఆధార‌ప‌డివుంద‌ని, ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని కోరుతున్నారు. చిన్న‌పిల్ల‌ల్లా వాటిని సాకామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆవులు ప్లాస్టిక్ క‌వ‌ర్లలో ఉన్న ప‌దార్థాల కోసం క‌వ‌ర్ల‌ను కూడా తినేస్తుండ‌టంతో మ‌ర‌ణిస్తున్న సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లుగా జ‌రుగుతున్నాయి. ప్ర‌జ‌లు కూడా వ్య‌ర్థాల‌ను ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో వ‌దిలిపెట్ట‌వ‌ద్ద‌ని, మూగ‌జీవాల‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని జంతు సంర‌క్ష‌ణ ప్రేమికులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

cow