తెలంగాణ రాష్ట్రం వ్య‌వ‌సాయ సంక్షోభంలో ఉన్న‌ద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. శ‌నివారం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు. వానాకాలంలో రైతు పండించిన ప్ర‌తీ గింజ‌ను కొంటామ‌ని సీఎం కేసీఆర్ అన్నార‌ని, ఎక్క‌డ కొనుగోలు జ‌ర‌గ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం చేతులెత్తేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. న‌ల్ల‌గొండ‌, మిర్యాల‌గూడ‌ల‌లో టోకెన్ తీసుకొని కోత చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో రేపు బృందాలుగా న‌ల్ల‌గొండ‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్ జిల్లాలలో ప‌ర్య‌టిస్తాయ‌ని తెలిపారు. రైతులు స‌మస్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి 4 బృందాలు వెళ్తాయని చిన్నారెడ్డి స్ప‌ష్టం చేశారు. మార్కెట్ క‌మిటీలు, మిల్ల‌ర్ల‌తో మాట్లాడుతాం అని చెప్పారు. రిపోర్టు త‌యారు చేసి పీసీసీ నేతృత్వంలో వ్య‌వ‌సాయ క‌మిష‌న‌ర్‌కు అందిస్తాం అని వివ‌రించారు. రైతుల‌ను నియంత్రిస్తే ఊరుకోం అని ర‌బీ పంట‌ను కూడ కొనాల్సిందేన‌ని తేల్చిచెప్పారు. రైతుల‌కు ఖ‌ల్లాల‌లో వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: