పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్‌ పై దృష్టి సారించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ  జాతీయ కన్వీనర్  అరవింద్‌  కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి  భగవత్‌ మాన్‌ ఇప్పుడు గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న   సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ మహాత్మగాంధీకి నివాళులు అర్పించారు. సబర్మతి ఆశ్రమ పరిధిలోని హృదయ్‌ కుంజ్‌ను ఇద్దరు సీఎంలు సందర్శించారు. ఈ ఏడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇద్దరు ఆప్ సీఎంలు రెండు కిలోమీటర్లు  రోడ్‌షో  కూడా నిర్వహించారు. గాంధీజీ పుట్టిన దేశంలో పుట్టడం అదృష్టంగా  భావిస్తున్నామంటున్నారు ఈ ఇద్దరు సీఎంలు.. దేశంలో ప్రతి గ్రామంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులు ఉన్నారన్న  భగవత్‌ మాన్  తానూ  అమరవీరుల భూమి నుంచే వచ్చానని అన్నారు. మరి పంజాబ్‌ ఫార్ములా గుజరాత్‌లో వర్కవుట్ అవుతుందా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

aap