కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఈ ఉదయం 9 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రమానికి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఆళ్లగడ్డ నియోజకవర్గం, శిరివెళ్ళ గ్రామం వెళ్తారు. అక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరి వెళ్తారు. మార్గ మధ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి జనసేనాని పవన్ కల్యాణ్ చెక్కులు అందచేస్తారు. ఈ మధ్యాహ్నం గం. 2 : 30 నిమిషాలకు జనసేనాని పవన్ కల్యాణ్ శిరివెళ్ళ చేరుకుంటారు. అక్కడ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు అందచేసి సభను ఉద్దేశించి జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి