అంబేడ్కర్‌.. భారత్‌కు రాజ్యాంగ ప్రదాత.. ఆయన తన జీవితాంతం సామాజిక న్యాయం నినాదాన్ని వినిపించాడు. సమానత్వం కోసం కృషి చేశాడు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడాడు. అయితే.. అలాంటి అంబేడ్కర్‌ నినాదాన్ని జగన్‌ సాకారం  చేస్తున్నాడంటున్నారు ఏపీ మంత్రులు.. జగన్ మూడేళ్ల పాలనలో సీఎం జగన్‌ ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని.. మంత్రివర్గ ఏర్పాటులో రెండుసార్లు కూడా బడుగు, బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. 25 మంది మంత్రుల్లో ఏకంగా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారున్నారని వారు గుర్తు చేస్తున్నారు. ఈ వర్గాలకు విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో అన్నీ దక్కితే సుపరిపాలన సాధ్యమవుతుందని వైసీపీ మంత్రులు అంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్ని రాజకీయ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల్లో సీఎం జగన్‌ 50 శాతం వరకూ రిజర్వేషన్‌ కల్పించారని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. మళ్లీ వాటిలో కూడా 50 శాతం మహిళలకు ఇవ్వడం అంబేడ్కర్ కల సాకారం చేయడమేనంటున్నారు వైసీపీ మంత్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: