పేదవారికి పక్కా ఇళ్లు నిర్మించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) PMAY-U పథకాన్ని 2024 డిసెంబర్ 31 వరకూ పొడిగించారు. ఈ పథకం కోసం ఈ ఏడాది మార్చి 31 వరకూ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.1,18,020.46 కోట్లు విడుదల చేసిందని కేంద్రం చెబుతోంది.


తాజాగా మరో రూ.85,406 కోట్లు విడుదల చేయబోతున్నారు. ఈ నిర్ణయంతో ప్రధాని నరేంద్రమోడీ గారు పేదల పక్షపాతిగా మరో సారి నిరూపించుకున్నారని బీజేపీ వర్గాలు ఘనంగా చెప్పుకుంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 21 లక్షల పేద కుటుంబాలకు  పక్కా ఇళ్ల నిర్మాణం కోసం  మోడీ ప్రభుత్వం రూ.32,000 కోట్లు మంజూరు చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. గుత్తేదారు జగన్ ప్రభుత్వం ఆ ఇళ్లకు “వైస్సార్ ఇళ్ళు” అని పేరైతే పెట్టింది కానీ నిర్మాణం పూర్తీ చేసి లబ్దిదారులకు ఇవ్వడం లేదని బీజేపీ నేతలు కొందరు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: