వాళ్ల దురదృష్టం ఏమని చెప్పాలి.. ఎప్పుడో 1998లో వాళ్లు టీచర్ ఉద్యోగం కోసం పరీక్షలు రాసి విజేతలయ్యారు. కానీ.. అనేక కారణాలతో వారికి ఉద్యోగాలు రాలేదు. దీంతో వారు కోర్టుకు వెళ్లారు. 1998 నుంచి ఆ కేసు నడుస్తోంది. ఇటీవల వారికి ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు వాళ్లలో చాలా మందికి 50 ఏళ్లు దాటిపోయాయి. అయినా జగన్ సర్కారు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది.

అయితే.. నిర్ణయం తీసుకున్నా అది అమలులోకి రాలేదు. ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డీఎస్సీ 98 అభ్యర్థులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.  పలు రకాల ఆందోళన తర్వాత దిగొచ్చిన ప్రభుత్వం  సర్టిఫికెట్లు పరిశీలించి తర్వాత పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజులలో విద్యార్హత పత్రాలు పరిశీలించి విధుల్లోకి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో హామీ ఇచ్చారని అభ్యర్థులు చెప్పారు. మంత్రి హామీ ఇచ్చే పది రోజులు దాటినా ఇంతవరకు ఎలాంటి సమాచారం తమకు రాలేదన్నారు. జగనన్నా.. ఇప్పటికైనా స్పందించి వెంటనే తమకు ఉద్యోగాలు వచ్చేలాగా చూడాలన్నా అంటూ చేతులెత్తి మొక్కుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: