సిఎం కేసిఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ వందల ఎకరాల భూ దందాలకు పాల్పడుతున్నారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  విమర్శించతారు.  నైజాం కాలం నుంచి హైదరాబాద్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పోలీసుల సహాయంతో సెటిల్మెంట్లు చేస్తున్నారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆరోపించారు. ధరణి పేరుతో భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారని.. కానీ ధరణితో ఏర్పడిన సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు లక్షల దరఖాస్తులు వస్తే.... అందులో ఒక్కటి కూడా పరిష్కరించలేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.


విదేశాలకు వెళ్లినవారు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి భూముల వివరాలను ధరణి పేరుతో తెలుసుకుని.. టీఆర్ఎస్ నాయకులు వాటిని కబ్జా చేస్తున్నారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  విమర్శించారు. జాతీయ పార్టీ అంటూ ప్రకటనలు చేస్తున్న కేసిఆర్‌... అంతర్జాతీయ పార్టీ పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, సచివాలయానికి రాకపోవడం, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయకపోవడమే తెలంగాణ మోడలా అని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: