పాదయాత్ర.. రాజకీయ నాయకులు ప్రజలకు దగ్గర అయ్యేందుకు ఇదో మంచి మార్గం. అందుకే చాలా మంది నాయకులు పాదయాత్రలపై ఆసక్తి చూపుతుంటారు. ఏపీలో ఇప్పుడు మరో నాయకుడు పాదయాత్ర ప్రారంభించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పాదయాత్ర చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారాలు, ప్రజలకు అండగా తెలుగుదేశం ఉందన్న భరోసా కల్పించేందుకు పాద యాత్ర చేపట్టానంటున్నారు.


జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం సోమవరం నుంచి జ్యోతుల నవీన్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో టీడీపీ శ్రేణులతోపాటు స్థానికులు భారీగా పాల్గొన్నారు.  నిత్యావసరాలు, గ్యాస్, పెట్రో, ఇసుక, విద్యుత్ ఛార్జీలు భారీగా  పెంచేశారని.. పేదలపై పెను భారం వేశారని నవీన్ అంటున్నారు.  ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని నవీన్ విమర్శించారు.  గురువారం రెండో రోజు కిర్లంపూడి మండలంలోని సోమరాయంపేట, పాలెం, గోనెడ గ్రామాల్లో పాదయాత్ర చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: