తెలంగాణలో ఉద్యోగాల జాతర వచ్చేసింది. ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఇటీవలే దాదాపు 10 వేల ఉద్యోగాలతో గ్రూప్ 4 ప్రకటన వచ్చింది. ఉపాధ్యాయ భర్తీల నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. నిరుద్యోగ యువత కోసం ఒకవైపు తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే, ఏళ్ళ తరబడి ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించింది.


త్వరలోనే మరో 10 వేల మంది ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించబోతోందట. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో మాత్రమే కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ , గురుకుల విద్యా సంస్థలతో ప్రత్యేక బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలే గాక, ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తమ ప్రభుత్వం మెరుగుపరిచింది. ఇప్పటిదాకా సుమారు 17 లక్షలమందికి పైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదేని మంత్రి కేటీఆర్‌ చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: