బీజేపీ, ఆర్ఎస్ఎస్ దక్షిణాదిలో తెలంగాణను లక్ష్యంగా చేసుకున్నాయని.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు పన్నుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వామపక్ష, లౌకిక శక్తులు భాజపా అధికారంలోకి రాకుండా నిరోధించాలని తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు పాల్పడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని తమ్మినేని వీరభద్రం దుయ్యట్టారు.


మనుధర్మం పాటించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటుందని..  కుల వ్యవస్థ పోవాలని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటుంటే.. భాజపా యదావిధిగా కుల వ్యవస్థ కొనసాగించాలని కోరుకుంటుందని తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై గట్టిగా పోరాటం చేస్తున్నారని.. భాజపాకు వ్యతిరేకంగా పని చేస్తున్న కేసీఆర్ కు సీపీఎం మద్దతు తెలిపిందని.. మునుగోడులో కమ్యూనిస్టులు మద్దతు తెలపడం వల్ల భారాస పది వేల ఓట్ల మెజారిటీతో గెలిచిందని తమ్మినేని వీరభద్రం చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp