ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ సవాల్‌ను స్వీకరించకుండా ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా చూసిన తర్వాత రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అర్థమైందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2/3 మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారంటే అయనే స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నట్లేనని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ను రెండు నియోజకవర్గల్లోనూ ప్రజలు ఓడిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట, సిరిసిల్ల ఉందని.. కానీ ఒక మైనార్టీ నేత ఉన్న కామారెడ్డికి వెళ్లడం మైనారిటీలను అవమానించడమేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాబై ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్దమని కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసురుతున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. 23లక్షల కోట్లతో తెలంగాణలో చేసిన అభివృద్ది ఏందో చర్చిద్దామని కేసీఆర్‌నుద్దేశించి రేవంత్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: