తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అస్తిత్వాన్ని, అవమానపరచడమేనంటూ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అయితే దీనిపై బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు.  మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి పప్పుజీ అంటూ బండి సంజయ్‌ ఎద్ధేవా చేశారు. 14 వందల మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధానిని ప్రశ్నిస్తోందని బండి సంజయ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకే ఓటు - రెండు రాష్ట్రాలు అనే తొలిసారి పిలుపునిచ్చింది అటల్ బిహారీ వాజ్‌పేయి అని బండి సంజయ్‌ అన్నారు.


మీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ తెలంగాణను మోసం చేసిందని మండిపడ్డారు. వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్‌ ప్రశ్నించారు. జవహర్‌లాల్ నెహ్రూ - జెంటిల్‌మన్ ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: