ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థనే తన క్యాంప్ ఆఫీసుగా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ ప్రాంగణంలో కొంత భాగం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుంటే.. తద్వారా ఆ సంస్థ పనితీరు ప్రభావితమవుతుందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్‌డీ మావన వనరుల అభివృద్ధి సంస్థను సందర్శించారు. ఆ సంస్థలో కొంత భాగాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌గా ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.


ఇక ఈ హెచ్‌ఆర్డీ సంస్థకు 1998లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వర్గీయ డాక్టర్ చెన్నారెడ్డి పేరు పెట్టారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాజీవితంలో తన సుదీర్ఘ, సుప్రసిద్ధమైన ప్రజాజీవితంలో ప్రదర్శించిన చెన్నారెడ్డి ఎంతో కృషి చేశారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ గవర్నర్‌గా కూడా పనిచేశారని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: