పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త ఇది. ఎప్పుడు పెరుగుతూ తగ్గుతూ వచ్చే బంగారం ధరలు నెల రోజుల్లో దాదాపు 600 రూపాయిలు తగ్గింది అంటే ఆశ్చర్య పోవాల్సిన విషయమే. గత నెల అంటే నవంబర్ నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40,410 రూపాయిలు ఉన్న బంగారం ధర ఇప్పుడు 39,770 రూపాయలకు దిగి వచ్చింది. అంటే నెల రోజుల వ్యవధిలో 640 రూపాయిలు క్షిణించింది. 

 

కాగా అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 590 రూపాయిలు క్షిణించింది. గత నెలలో ఇదే రోజున బంగారం ధర 37,050 ధర వద్ద కొనసాగగా రోజుకు 50, 60 తగ్గుతూ పెరుగుతూ ఈరోజు బంగారం ధర 36,460 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. 

 

గతనెలలో ఈరోజు అంటే నవంబర్ 2వ తేదీన వెండి ధర 48,500 రూపాయిల ఉండగా ఇప్పుడు ఈ వెండి ధర 46,650 రూపాయిలకు క్షిణించింది. అంటే వెండి ధర ఒక్క నెలలో ఏకంగా 1850 రూపాయిలకు పడిపోయింది. ఏది ఏమైనా ఇంత పడిపోవటం ఇదే మొదటిసారి అని చెప్పాలి. 

 

ఇంకా దేశ రాజధానిలో ఢిల్లీలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు పడిపోగా అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 450 రూపాయిలు క్షిణించింది. గత నెలలో ఇదే రోజున బంగారం ధర 37,850 ధర వద్ద కొనసాగగా ఈరోజు బంగారం ధర 37,200 రూపాయలకు పడిపోయింది. 

 

అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఒక నెలలోనే బంగారం ఇంత తగ్గటం పసిడి ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: