బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి.. మూడు రోజుల నుండి బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా తగ్గడం వల్లే బంగారం ధరలు ఇలా క్షిణించాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే.. ఒకప్పుడు ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గేవి. కానీ ఇప్పుడు మరి దారుణంగా తయారయ్యాయి.. 

 

ఒక రోజు వంద తగ్గితే మరో రోజు వెయ్యి రూపాయిలు పెరుగుతుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఎంత తగ్గాయి చేస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం బంగారం ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయిల తగ్గుదలతో 43,780 రూపాయలకు చేరుకుంది. 

 

అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయిల తగ్గిదలతో 40,013 రూపాయలకు చేరుకుంది. ఇంకా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కేజీ వెండి ధర ఈరోజు 48,030 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక ఢిల్లీ మార్కెట్లోను ఇలాగే బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: