దేశంలో రోజురోజుకూ బర్డ్ ఫ్లూ విజృంబిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలలో ఇప్పటికే ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం తీవ్రంగా ఉంది. దీని దెబ్బకు వందలాది పక్షుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ముఖ్యంగా వీటి ప్రభావం కోళ్ళు, బాతులపై అధికంగా ఉండడం వల్ల వీటి కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు. అయితే తెలంగాణలో బర్డ్ ఫ్లూ దెబ్బకు గ్రేటర్ హైదరబాద్ లో చికెన్ ధరలు అమాంతగా పడిపోయాయి. పండుగ సీజన్ కావడంతో  హైదరాబాద్‌నగరంలో వ్యాపారులు భారీగా చికెన్‌ అమ్మకాలు జరుపుతున్నప్పటికి, బర్డ్ ఫ్లూ విజృంబిస్తున్న కారణంగా మాంసప్రియులు చికెన్ కొనుగోలు చెయ్యడానికి ముందుకు రావడం లేదు.

దాదాపుగా నగర వాసుల్లో దాదాపు 80 నుడి 90 శాతం మంది చికెన్‌ కొనుగోలు చెయ్యడానికి ఆసక్తి కనబరచడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని, చికెన్‌తినడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగదని ప్రభుత్వం చెబుతున్నప్పటికి ప్రజలు మాత్రం బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ వైపు చూడడం లేదు. దీంతో చికెన్ ధరలు సంక్రాంతి పండుగ రోజున భారీగా పడిపోయాయి. ఏకంగా కిలో చికెన్ ధర 50 మేర తగ్గడంతో ప్రజలు చికెన్ ను పట్టించుకోవడం మానేశారని స్పష్టంగా అర్థమౌతుంది. గతంలో కిలో 200 రూపాయలు ఉన్న చికెన్ ప్రస్తుతం 150రూపాయలకు పడిపోయింది.

అయినా కొనేందుకు వినియోగ దారులు జంకుతున్నారు. ఇదిలా ఉండగా మటన్ వైపు మాంస ప్రియుల ఆసక్తి పెరిగింది. దీంతో మటన్‌కు డిమాండ్ బాగా‌ పెరిగింది. అందువల్ల కొందరు వ్యాపారులు ఇప్పటికే ధరలు భారీగా  పెంచేశారు. మటన్‌ ధర కిలో కు 700 రూపాయలు కాగా గురువారం పండగ నేపధ్యంలో వ్యాపారులు ఏకంగా కిలో 760 నుంచి 800 రూపాయల వరకు పెంచి మాంస ప్రియులకు ఒక్క సారిగా షాక్ ఇచ్చారు. సాదారణ రోజుల్లో మటన్‌ అమ్మకాలు రోజుకు లక్ష నుంచి రెండు లక్షల కిలోల వరకు ఉంటుంది. కానీ సంక్రాంతి కారణంగా గురువారం ఒక్కహైదరాబాద్‌నగరంలోనే దాదాపు 3.5 లక్షల కేజీల మటన్‌అమ్మకాలుజరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. మరి బర్డ్ ఫ్లూ మరింత విజృంబిస్తే మటన్ దర  రూ.1000 చేరిన ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: