ఈ-కామర్స్ కంపెనీలు దసరా, దీపావళి వంటి పండుగ దినాల్లో తమ ప్రోడక్ట్ పై భారీగా డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. సమ్మర్ స్పెషల్ అంటూ కూడా డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్స్ ఇస్తుంటాయి. కానీ ఎటువంటి ప్రత్యేక దినాలు లేని ఈ సమయంలో ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఓ ఖరీదైన ఏసీ పై అదిరిపోయే డిస్కౌంట్ ప్రకటించి కస్టమర్లను ఆశ్చర్యపరిచింది. ఈ కంపెనీ సోమవారం రోజు రూ.96,700 విలువైన తోషిబా ఎయిర్ కండిషనర్ (ఏసీ) పై 94 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. దీనితో ఈ ఖరీదైన ఏసీ రూ.90,800 తగ్గి రూ.5900కు అందుబాటులోకి వచ్చింది. దీంతో కొందరు ఈ ఏసీ ని ఆర్డర్ పెట్టారని తెలుస్తోంది. అయితే, నిజానికి అమెజాన్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా 94 శాతం డిస్కౌంట్ ఇవ్వలేదు. ఒక పొరపాటు కారణంగా తోషిబా 2021 రేంజ్ స్ప్లిట్ సీస్టమ్ ఏసీ 5,900 రూపాయలకే సేల్ చేస్తున్నట్టు వెబ్ సైట్ లో కనిపించింది.

ఈ పొరపాటును వెంటనే గుర్తించిన ఆ వెబ్ సైట్ యాజమాన్యం సరి దిద్దింది. దీంతో సుమారు 6 వేల రూపాయలతో లక్ష రూపాయల ఎయిర్ కండిషనర్ సొంతం చేసుకోవాలనుకున్న వినియోగదారుల ఆశలు నీరుగారిపోయాయి. ప్రస్తుతం ఈ ఎయిర్ కండిషనర్ ధరపై 34 శాతం డిస్కౌంట్ ప్రకటించగా దాని ప్రస్తుత ధర రూ.59,000 వద్ద నిలిచింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అమెజాన్ చేసిన పొరపాటును ప్రస్తావిస్తూ విమర్శలు ట్రోల్ చేస్తున్నారు.

ఇకపోతే ప్రపంచంలోనే నంబర్ 1 ఈ-కామర్స్ కంపెనీగా పేరొందిన అమెజాన్ ఇప్పటికే చాలా పొరపాట్లు చేసి విమర్శల పాలైంది. ఇటీవల ఢిల్లీ వ్యక్తికి రిమోట్ కంట్రోల్ కార్ కి బదులు పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ పంపింది. మరొక సందర్భంలో ఎటువంటి ఆర్డర్ ప్లేస్ చేయని మహిళకు ఒక సబ్బు, చిన్న పిల్లల పుస్తకాలు డెలివరీ చేసింది. 2019లో ప్రైమ్ డే సందర్భంగా రూ.9 లక్షల విలువైన కెమెరా గేర్ పై 99.4 శాతం డిస్కౌంట్ ప్రకటించే రూ.6,500కే సేల్ లోకి తెచ్చింది. అయితే ఈ విషయం తెలిసిన కస్టమర్లు కెమెరా గేర్ ను భారీ ఎత్తున ఆర్డర్స్ పెట్టారు. అయితే ఈ పొరపాటును గుర్తించిన అమెజాన్ వెంటనే అప్రమత్తమై ఆ ఆఫర్ నిలిపివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: