ఫోర్డ్ పై కన్నేశారు !

ప్రపంచంలో పేరెన్నిక గన్న వాహనాల తయారీ సంస్థ పోర్డ్. ఈ కంపెనీల వాహనాలు  ప్రపంచంలో ని ఏ  మారు మూలకు వెళ్లినా కనిపిస్తాయి. భారత్ లో మాత్రంఫోర్ట్  సంస్థ తన దుకాణాన్ని సర్దేసింది. భారత వ్యాపార ముఖచిత్రం పై నుంచి  వైదొలుగుతున్నట్లు ఆ సంస్థ  ఇటీవలే ప్రకటించిది.  దానికి గల కారణాలనూ వివరించింది. క్రమంగా ప్లాంట్ లను మూసివేస్తామని కూడా ఫోర్డ్ ప్రకటించింది.  భారత్ నుంచి వెళ్లిపోయిన వాహన కంపేనీల జాబితాలో చేర నుంది. గతంలో భారత దేశంలో వాహనాలను తయారు చేసి ప్రపంచానికి అందించిన  బహుళజాతి సంస్థ తవేరా కంపెనీ కూడా భారత్ లో తన వాహనాల తయారీని నిలిపివేసింది. తాజాగా ఫోర్డ్ కూడా వాహనాల తయారీ ని నిలిపి వేసింది.

 దీంతో ఫోర్డ్ ఆస్తులను స్వంతం చేసుకునేందుకు భారత్ లోని పలు వాహన తయారీ రంగ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఫోర్డ్ సంస్థ కు భారత దేశంలో  తమిళనాడు రాష్ట్రంలో మరామలై నగర్ వద్ద ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ సామర్థ్యం  రెండు లక్షల వాహనాలు. అంతే కాకుండా  మూడు లక్షల నలభై వేలకు పైగా ఇంజిన్ లను తయారు చేసేది. ఇదే సంస్థకు గుజరాత్ లో కూడా మరో ప్లాంట్ ఉంది.  ిది తమిళనాడు  ప్లాంట్ కన్నా పెద్దది.  ఇక్కడి  తయారీ సామర్ధ్యం కూడా ఎక్కువే.  ప్లాంట్ లో రెండు లక్షల డెబ్బై వేల ఇంజన్లు, రెండు లక్షల నలభైవేలకు పైగా వాహనాలు తయారు చేసేది.  ప్రస్తుతం ఈ  రెండు ప్లాంట్ల లనూ వాహనాల తయారీని  ఫోర్డ్ నిలిపి వేసింది.
 ఈ  రెండు ప్లాంట్లను స్వంతం చేసుకోవాలని భారత్ లోని వాహన తయారీ రంగ సంస్థలు  ఉవ్విళ్లూరుతున్నాయి. దీనికి కారణం లేక పోలేదు.  కోవిడ్-19 తరువాత  ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు వాహన రంగ అభివృద్ధికి పరోక్షంగా ఊతం ఇచ్చాయి. సామాన్యులు సైతం సొంత వాహనాల్లోనే ప్రయాణించాలని భావిస్తున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా భారత్ లో  వాహనాలకు గిరాకీ ఏర్పడింది.  పెరుగుతున్న ప్రజావసరాలకు అనుగుణంగా వాహన తయారీ దారులు వాహనాలకు సరఫరా చేయలేకున్నారు. భారత్ లోని అన్ని కంపెనీల ప్లాంట్లూ పూర్తి  సామర్థ్యంలో పనిచేస్తున్నాయి. ప్రజల అవసరాలు పెరగడంతో అన్ని ప్లాంట్లు అధికంగా ఉత్పత్తి చేయాల్సి ఉంది. దీంతో  కొత్త   ప్లాంట్ లు దాదాపు |అన్ని వాహన సంస్థలకు అవసరమయ్యాయి. నూతన ప్లాంట్ ఏర్పాటు చేయడం, దానికి తగ్గ అనుమతులు తీసుకోవడం చాలా శ్రమ, సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉన్నందున  భారత్ లోని వాహన రంగ తయారీ సంస్థలు  టాటా మోటార్స్, కియా, మహీంద్రా, తో పాటు ఎం.జి వాహనాల తయారీ సంస్థకూడా ఫోర్ట్ ను స్వంతం చేసుకోవాలని ఉబలాటపడుతున్నాయి. వీరందరికన్నా ముందు వరసలో టాటా మోటార్స్ ఉండే అవకాశం ఉంది. టాటా గ్రూప్ చైర్మన్ ఇటీవల దక్షిణాదిలో పర్యటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య ఫోర్డ్ మోటార్స్ ప్రస్తావన వచ్చింది. దీంతో ఫోర్డ్ ను స్వంతం చేసుకునే అలోచనలో టాటాలు ముందు వరసలో ఉన్నట్లు స్పష్టమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: