
* బడ్జెట్ అంచనాలను అందుకోకపోవడంతో నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ ..
* 400కు పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ ..
* నిఫ్టీ 135 పాయింట్లు డౌన్ ..
ఇక కేంద్ర ఆర్థిక మంత్రి ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది .. దేశీయ సూచీలు లాభనష్టాల్లో దోబూచులాడుతున్నా .. ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నష్టాల బాట పెట్టాయి .. బడ్జెట్ అని తర్వాత మళ్లీ తీరుకున్నాయి ప్రస్తుతం తీవ్ర గందరగోళంలో ఉన్నాయి . శుక్రవారం ముగింపు (77, 500) దశతో పోల్చుకుంటే శనివారం 100 పాయింట్లకు పైగా లాభాలతో మొదలైన సెన్సెక్స్ .. బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కనిపించింది ..
ఒకానొక సమయంలో 400 పాయింట్లకు లాభపడి 77, 899 వద్ద గరిష్టానికి చేరుకుంది .. అయితే బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్దిసేపటికి నష్టాల్లోకి వెళ్లిపోయింది . గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 900 పాయింట్లు కోల్పోయింది 77, 006 వద్దకు చేరుకుంది .. ఇక ప్రస్తుతం మధ్యాహ్నం 12 తర్వాత 33 పాయింట్లు కోల్పోయి ..77, 466 వద్ద కాన్స్టెంట్గా కొనసాగుతుంది .. మరోపక్క నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాట లోనే నడుస్తుంది .. ప్రస్తుతం 13 పాయింట్లు నష్టం తో 23 ,474 వద్దను నడుస్తుంది . ఇక సెన్సెక్స్‌లో హెచ్‌ఎఫ్‌సీఎల్, ప్రెస్టేజ్ ఎస్టేట్, మారుతీ సుజుకీ, గోద్రేజ్ కన్స్యూమర్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. . ఎస్కార్ట్ కుబోటా, జిందాల్ స్టెయిన్‌లెస్, హుడ్కో, లార్సన్ షేర్లు భారీగా నష్టాల్లో ఉన్నాయి . నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ స్వల్ప నష్టాల తో కొనసాగుతోంది . బ్యాంక్ నిఫ్టీ 172 పాయింట్ల నష్టంతో ఉంది..