రతన్ టాటా ..ఈ పేరు వినగానే అందరికీ ఓ తెలియని గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పిరేషన్ గా నిలిచారు రతన్ టాటా. .. దిగ్గజ పారిశ్రామికవేత్త దాతృత్వానికే లెక్కకు మించిన డబ్బు వేచించిన దయాశిలి రతన్ టాటా గురించి అందరికీ తెలిసిందే.  వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా ఉండి తనదైన స్టైల్ లో ముందుకు వెళ్లిన రతన్ టాటా ఈ మధ్యనే కన్నుమూశారు . అయితే రతన్ టాటా చనిపోయిన తర్వాత అందరూ ఎక్కువగా మాట్లాడుకునింది చర్చించుకున్నది ఆయన ఆస్తి గురించే.


ఈయన ఆస్తి ఎవరికి చెందుతుంది అనే విధంగా ఎక్కువ మంది మాట్లాడుకున్నారు . ఎవరికి ఎంత వాటా రావాలి అనేది క్లియర్ గా రాసి పెట్టారు వీలునామాలలో రతన్ టాటా.  రతన్ టాటా తన ఆస్తీలో ఎక్కువ వాటా ఎవరికీ కేటాయించారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది . ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం తన వీలునామాలో ఎండోమెంట్ ఫౌండేషన్ టాటా.. ఎండోమెంట్ ట్రస్ట్ కోసం ఎక్కువ మొత్తంలో కేటాయించినట్లు తెలిసింది . అంతేకాదు తన సవతి సోదరీమణులైన శిరీని,దియానా మీద కొంత ఆస్తిని రాశారట .



అయితే మరి కొంత ఆస్తిని జిమ్ని నావల్ టాటాకు కేటాయించినట్లు తెలుస్తుంది . జుహులోని బంగ్లా.. బంగారు ఆభరణాలు వెండి వస్తువులు మొత్తం జిమ్ని కే దక్కుతుంది.  తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం రతన్ టాటా తన ఆప్త మిత్రుడు తాజ్ హోటల్స్ గ్రూప్ మాజీ డైరెక్టర్ అయిన మోహిని మోహన్ దత్తా కు కూడా తన ఆస్తిని కేటాయించిన్నట్లు తెలుస్తుంది . రతన్ రతన్ టాటా మిగిలిన మొత్తం ఆస్తిలో  మూడింట ఒక వంతు వాటా అంటే సుమారు  588 కోట్లు ఆయనకు దక్కేలా వీలునామాలో రాశారట.  



కుటుంబ సభ్యులు కాకుండా భారీ మొత్తంలో రతన్ టాటా ఆస్తిని పొందిన ఏకైక వ్యక్తిగా మోహిని మోహన్ దత్త రికార్డ్ క్రియేట్ చేశారు . రతన్ టాటా కు చెందిన 3900 కోట్ల విలువైన ఎస్టేట్ ను సుమారు 20 మందికి పైగా పంచగా అందులో దత్త వారసత్వ విలువపై కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  "నో కాంటెస్ట్ క్లాస్" కారణంగా వీలునామాను ఎవరైనా వ్యతిరేకిస్తే వారి వాటా రద్దు అవుతుంది. కొన్ని నివేదికల ప్రకారం మోహిని - రతన్ టాటా దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగించారు అని టాటా తన పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ప్రతి విషయం కూడా మోహన్ తో షేర్ చేసుకునేవారు అని తెలుస్తుంది . రతన్ టాటా తన జీవితంలో ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు అని స్వయంగా దత్తానే అనేక సందర్భాలలో చెప్పడం గమనార్హం..!

మరింత సమాచారం తెలుసుకోండి: