కొబ్బరి యాపిల్ హాల్వా ఎప్పుడైనా తిన్నారా? ఎంత బాగుంటుందో తెలుసా? మరి అంత బాగుండే కొబ్బరి హల్వాను మీరు ఎప్పుడైనా తిన్నారా? పోషకాలు ఉండే ఈ కొబ్బరీ యాపిల్ హల్వాను పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి అలాంటి ఈ యాపిల్ కొబ్బిరి హల్వాను ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. రుచిని ఆస్వాదించండి.. 

 

IHG

 

కావాల్సిన పదార్ధాలు.. 

చక్కెర, చిక్కనిపాలు, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు, 

యాపిల్‌ - ఒకటి, 

డ్రై ఫ్రూట్స్‌ పలుకులు - గుప్పెడు, 

నెయ్యి - 2 చెంచాలు,

యాలకుల పొడి - అరచెంచా.  

తయారీ విధానం.. 

 

IHG

 

ఒక గిన్నెలో పాలు, చక్కెర, యాపిల్‌ తురుము వేసి కలిపి ఆ గిన్నెను స్టౌ మీద పెట్టి సన్నని మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి. ఆ మిశ్రమం చిక్కబడ్డాక డ్రైఫ్రూట్స్‌ పలుకులు, చెంచా నెయ్యి కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, యాలకులపొడి వేసి మరోసారి కలిపి మరో చెంచా నెయ్యి కలిపి 5 నిమిషాలు ఉడికించుకొంటే వేడివేడి రుచికరమైన హల్వా తయారవుతుంది. మంచి రంగు రావాలి అంటే కాస్త ఫుడ్ కలర్ వేసుకుంటే చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది.                                   

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: