బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి గాని మనకు తెలియదు. వెజిటేబుల్ స్టఫ్ మసాలా బిర్యాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. కావలసిన పదార్థాలు ఏంటీ అంటే... యాలకుల పొడి: 1 టేబుల్ స్పూన్. కొత్తిమీర: 1కట్ట, పసుపు: ½ టేబుల్ స్పూన్. పాలు: ¼ కప్. నెయ్యి: 2 టేబుల్ స్పూన్ లు. రీఫైండ్ ఆయిల్: తగినంత వేయండి.  ఉప్పు: రుచికి సరిపడా వేయండి. కారం: 1 టేబుల్ స్పూన్. పచ్చిమిర్చి పేస్ట్: 1 టేబుల్ స్పూన్. పెరుగు: 1 కప్,  పుదీనా: ½ కప్. వెజిటబుల్ ముక్కలు: 4 కప్, మసాలా దినుసులు: 10 గ్రాములు, బాస్మతి రైస్: ½ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్ లు, ఉల్లిపాయలు: 1 కప్ కావాలి.

ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి మరిగిన తర్వాత మసాలా దినుసులు వేసి వేయించండి.  అందులోనే పుదీనా, కొత్తిమీర, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, యాలక్కాయల పొడి, కారం, ఉప్పు, బీన్స్, క్యారెట్ టమోటో, ఉల్లిపాయ ముక్కలు, పెరుగులను వేసి వేయించింది. తర్వాత ఇంకో గిన్నెలో బియ్యం ఎసరు పెట్టి, అందులో పాలు కూడా పోసి ఎసరు వచ్చాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి,సగం ఉడికాక గంజి వార్చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక వెడల్పాటి పాత్రలో అడుగున ఉడికించిన రైస్ కొద్దిగా వేయండి.

పైన వేయించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను వేసి, మళ్లీ కొద్దిగా అన్నం.. ఇలా 4 వరుసలుగా పెర్చుకోండి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించండి.  ఆ తర్వాత మూత తీసి సరిపడా నెయ్యి వేసి.. అన్నాన్ని దించండి. అంతే చాలా ఈజీ గా ఏ మాత్రం కంగారు లేకుండా వెజిటేబుల్ మసాలా స్టఫ్డ్ బిర్యానీ రెడీ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: