ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.మనం ఎన్నో రకాల స్వీట్స్ ని మన నిత్య జీవితంలో తింటూ ఉంటాము. స్వీట్ రుచి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అయితే  సత్తు కి బర్ఫీ తేలికగా ఇంట్లోనే చేయగల స్వీట్, అంతేకాకుండా ఇదొక ప్రోటీన్ బార్ అని చెప్పొచ్చు. దీనిలోని పదార్ధాలు, దీని రుచిని మరింత పెంచేవిగా ఉంటాయి.ఇది రోజు తినటం వలన ఖచ్చితంగా బలంగా ఉంటారు. చాలా పుష్టిగా ఉంటారు. ఇది కొన్ని నిమిషాల్లోనే చాలా సులభంగా తయారు చేయొచ్చు. అంతేకాకుండా, ఇందులో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. మీకు కొద్దిగా టైం అందుబాటులో ఉన్న సమయంలోనే మీరు ఈ రెసిపీని తప్పకుండా ప్రయత్నించవచ్చు. సత్తు కి బర్ఫీని, ప్రోటీన్ బార్ అని కూడా అంటారు. మీరు ఇంట్లోనే ఈ రెసిపీని ఎంతో ఈజీగా తయారు చేయవచ్చో ఇండియా హెరాల్డ్  అందిస్తున్న ఈ ఆర్టికల్ లో  చూడండి.



సత్తు కి బర్ఫి తయారీకి కావాల్సిన పదార్ధాలు....

200 గ్రాములు సెనగ పప్పు
120 గ్రాములు నెయ్యి
120 గ్రాములు చక్కర పొడి
6 గ్రాములు ముక్కలుగాా కోసిన బాదం
1 చిటికెడు కుంకుమ పువ్వు
1 చిటికెడు పొడిగా చేసిన యాలకులు


ఇప్పుడు ఈ రుచికరమైన సత్తు కి బర్ఫి తయారు చేయు విధానం...

ఒక బాణలిలో పుట్నాలను వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి. ఇది బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించి, ఆపై చల్లారనివ్వండి.మిక్సర్లో ఈ వేయించిన పచ్చి సెనగ పప్పును వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఒక గిన్నెలో ఈ పొడిని తీసుకుని, అందులో పొడి చక్కెర పొడిని వేసి బాగా కలపాలి. ఆపై నెయ్యి వేసి.. పిండిలా కలపండి.ఈ బర్ఫీ పిండిని, ఒక ప్లేట్‌లో వేసి అందులో యాలకుల పొడి, తురిమిన బాదం, కుంకుమ రేకులు వేసి అలంకరించండి.దీనిని 30 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఆపై ముక్కలుగా కట్ చేసి సాయంత్రం పూట స్నాక్స్ గా తీసుకోవచ్చు.ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: