ముందుగా కావాల్సిన పదార్ధాలు.....
పులసచేప - ఒక కేజీ,
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు,
పచ్చిమిర్చి - అయిదు,
చింతపండు గుజ్జు - అరకప్పు,
టమాటా గుజ్జు - ఒక కప్పు,
కరివేపాకు - గుప్పెడు,
ధనియాల పొడి - రెండు టీ స్పూనులు,
జీలకర్ర - అరటీస్పూను,
మెంతిపొడి - పావు టీస్పూను,
ఉప్పు - రుచికి సరిపడా,
కారం - ఒక టీస్పూను,
నూనె - తగినంత,
పసుపు - పావు టీస్పూను,
కొత్తిమీర తరుగు - మూడు టీస్పూనులు
పులస చేప పులుసు తయారు చేయు విధానం....
చేప ముక్కలు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. పచ్చిమిర్చి నిలువుగా కోయాలి. ఇప్పుడు స్టవ్ పై కిలో చేపల కూర ఉడికేంత పెద్ద కళాయి పెట్టి.... అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక అందులో టమాటా గుజ్జు వేసి కలపాలి. అందులో చింతపండు పులుసు, కారం, పసుపు కూడా వేసి బాగా వేయించాలి.
అందులో రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. ఓ పదినిమిషాల తరువాత అందులో చేప ముక్కలు వేసి చిన్న మంటపై ఉడికించాలి. ఓ పదినిమిషాల తరువాత ధనియాల పొడి, మెంతిపొడి, కరివేపాకు, కారం వేసి ఓసారి కలిపి ఉడికించాలి. ఓ 20 నిమిషాల తరువాత చేప ఉడికిందో లేదో చూడాలి. పులుసు చిక్కగా అయ్యాక పైన కొత్తిమీర చల్లి దించేయాలి.
ఇక రుచికరమైన పులస చేప కూర తయారైనట్లే.. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి