ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కొత్తిమీర ఒక మంచి కూరకి  మంచి రుచిని ఇస్తుంది.కొత్తిమీర రైస్ రుచికరంగానే కాదు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక ఈ రుచికరమైన కొత్తిమీర రైస్ ని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

కావాల్సిన పదార్థాలు...వండిన అన్నం - ఒక కప్పు, కొత్తిమీర తరుగు - ఒక కప్పు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్న ముక్క, ఆవాలు, జీలకర్ర - చెరో పావు స్పూను, శెనగపప్పు, మినపప్పు - చెరో స్పూను, నెయ్యి - ఒక టీస్పూను, ఉప్పు - ఒక టీస్పూను..

కొత్తిమీర రైస్ తయారు చేయు విధానం....

ముందుగా వేడి వేడిగా అన్నం వండి పక్కన పెట్టుకొండి. అన్నం ముద్దగా చేసుకోకుండా ... పొడిపొడిగా ఉండేలా వండుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు, అల్లం, పచ్చిమిర్చి కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నెయ్యి వేసి... అందులో జీడిపప్పు వేయించి తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఆవాలు జీలకర్ర, శెనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించాలి. అనంతరం రుబ్బి పెట్టుకున్న కొత్తమీర మిశ్రమాన్ని వేసి కలపాలి. ఉప్పు కూడా వేయాలి.

కొత్తిమీర పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. అనంతరం స్టవ్ కట్టేసి... కొత్తిమీర మిశ్రమంలో వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలపాలి. పైన వేయించిన జీడిపప్పు చల్లితే చాలా టేస్టీగా ఉంటుంది.ఇక ఇలాంటి మరెన్నో వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: