ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చలికాలమైన ఎండా కాలమైన ఏ కాలమైన కాని కుల్ఫీ ని తినడానికి చాలా ఇష్టపడతారు. ఇది ఎంతో రుచికరంగా ఇంకా తీయగా ఉంటుంది. ఒక్కోసారి నోట్లో పెట్టుకోని తినగానే ప్రాణం జివ్వుమంటుంది. అంత రుచికరంగా ఉంటుంది కుల్ఫీ..ఈ కుల్ఫీ అనేది కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక ఈ రుచికరమైన కుల్ఫీని తినడానికి చాలా మంది ఇష్టపడతారు.. ఈ కూల్ఫీని మనం అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇక డ్రై ఫ్రూట్స్ తో అయితే ఇంకా బాగుంటుంది. మరి డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...


డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ కి కావాల్సిన పదార్ధాలు...

పాలు - నాలుగు కప్పులు,
డ్రైఫ్రూట్స్ - ఒక కప్పు,
పంచదార - ఒక కప్పు,
కోవా - అరకప్పు,
కండెన్స్ డ్ మిల్క్ - అర లీటరు...

డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ తయారు చేయు విధానం...

ముందుగా డ్రైప్రూట్స్ వేయించి మరీ మెత్తగా కాకుండా... పలుకుగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి పాలు పోసి చిన్న మంట మీద మరిగించాలి. పాలు సగం అయ్యే వరకు మరిగించాలి. అనంతరం కోవా, డ్రైఫ్రూట్స్ తరుగు, కండెన్స్ డ్ మిల్క్ వేసి చిన్న మంట మీద మరిగించాలి. ఆ మిశ్రమం మొత్తం దగ్గరగా వచ్చి క్రీమీలా అయ్యేవరకు మరిగించాలి. ఆ సమయంలో పంచదార వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరువాత స్టవ్ కట్టేయాలి. మిశ్రమం చల్లారాక కుల్పీ మౌల్ట్ లలో దానిని వేసి డీప్ ఫ్రిజ్ లో ఐదారు గంటలు ఉంచితే కుల్ఫీ సిద్ధమై పోతుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన మరెన్నో వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: