ఇకపోతే ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం అరాచకం అని చెప్పాలి.. భర్త నైట్ డ్యూటీ లో ఉంటె భార్య మాత్రం వేరొకరితో పడక సుఖాన్ని పొందింది. అందుకు ఫలితంగా ఆమెకు పండండి ఆడబిడ్డ పుట్టింది. భర్తకు ఆడపిల్ల పుట్టిందని చెబితే ఒప్పుకోడని దారుణానికి ఒడిగట్టింది ఆ కసాయి తల్లి. ఆ బిడ్డను చంపేసి ప్లాస్టిక్ కవర్ లో చుట్టి చెత్తలో పడేసింది. చెత్త ఎత్తేవాళ్లు ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహావీర్ సింగ్ , నిషా కి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఆమె తన అత్తమామలతో కలిసి ఉంటుంది. మహావీర్ మాత్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండేవాడు. నిషా కొంత కాలంగా ఓ వ్యక్తితో శారీరక సంబంధాన్ని పెట్టుకుంది. అది భర్తకు తెలిసింది. అయితే పెద్దలు సర్ది చెప్పడంతో ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.ఆమె ఒక్కటే ఆసుపత్రిలో చూపించుకుంటూ వస్తుంది. ఓ రోజు భర్త లేని టైం లో నొప్పులు రావడంతో ఇంట్లోనే కనింది. పుట్టింది ఆడ శిశువు కావడంతో భర్త తిడతాడని బిడ్డను అతి దారుణంగా చంపి, కవర్ లో పెట్టి చెత్తలో వేసింది. అది చూసిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి