దేశంలో రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. కొంతమంది ఆస్తుల కోసం హత్యలు చేస్తుంటారు. కొంతమంది భూమి కోసం హత్యలు చేస్తుంటారు. వీటితో పాటు పుట్టిన పిల్లల నుంచి ముసలి తల్లి వరకు ఎవరిని కూడా వదిలేయకుండా ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది కామ పిశాచాల చేతిలో ఎంతోమంది పిల్లలు, యువతులు బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా ఈ అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దిశా ఘటన, ప్రియాంక రెడ్డి ఘటన దేశంలో సంచలనం రేపాయి. వీటిపై దిశ చట్టం తీసుకు వచ్చారు. అయినా ఆ కామాంధులు కళ్లుమూసుకుపోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
వివరాల్లోకి వెళితే అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటోంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం విశ్వనాథ పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వ్యవసాయం, కూలి పనులు చేస్తూ ఉంటాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి