దొంగలను దొంగ అంటే పర్వాలేదు కానీ మంచి వాళ్ళని దొంగ అంటే మాత్రం వారి మనస్సు ఎంతగానో బాధ పడుతుంది. కానీ ఏం చేస్తాం పాడు సమాజం మంచి వాళ్లనే చెడ్డవాళ్లు గా చిత్రీకరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అభం శుభం తెలియని వ్యక్తిపై దొంగ అనే ముద్ర వేసారు. దీంతో అతని మనసు తల్లడిల్లి పోయింది. ఎవరి జోలికి పోని నన్ను దొంగ అంటున్నారు అంటూ ఎంతగానో బాధ పడి పోయాడు. చివరికి దొంగ అని దారుణమైన ముద్ర పడిన తర్వాత ఇక్కడ ప్రాణాలతో ఉండడం అవసరమా అని కఠిన నిర్ణయం తీసుకున్నాడు  చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


 ఈ విషాదకర ఘటన హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఫిలింనగర్లోని దీన్ దయాల్ నగర్ లో ఉండే శివరాం మూడు నెలల క్రితం మణికొండలోని జియో మార్ట్ స్టోర్ లో పనికి చేరాడు. అయితే గత వారం రోజుల నుంచి సరిగ్గా తినకపోవడం ఆందోళనగా ఉండడం గమనించిన భార్య ఏం జరిగింది అని ప్రశ్నించగా ఒత్తిడి ఎక్కువైంది అంటూ సమాధానం చెప్పాడు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే ఇటీవలే విధులకు వెళ్ళాడు శివరాం. ఇక భార్య బంధువుల వేడుకకు వెళ్ళింది. అయితే మధ్యాహ్నం ఇంటికి వచ్చిన శివరాం గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చిన భార్య లోపల ఉన్న భర్తను ఎంత పిలిచినా తలుపు తీయలేదు.


 ఈ క్రమంలోనే అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూసేసరికి ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు శివరాం. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పక్కనే పుస్తకంలో ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు  సంతోష్ సార్. హబ్ లో కనిపించని రెండు లక్షల విషయంలో దొంగ గా ముద్రవేశారు. నేను భరించలేను అందుకే ఆత్మహత్య చేసుకున్న.. ఐ యాం సారీ సార్ యువర్ సిన్సియర్లీ శివరాం అంటూ సూసైడ్ నోట్లో రాశాడు. పోయిన డబ్బులు తాను ఒక్క రూపాయి కూడా తినలేదని తాను తప్పు చేయలేదని దొంగ అనడంతో మానసిక ఒత్తిడికి గురయ్యా నేను వదిలి వెళ్తున్నందుకు క్షమించాలి అంటూ మరో పేజీలో భార్యను ఉద్దేశిస్తూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు శివరాం.

మరింత సమాచారం తెలుసుకోండి: