ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాలు ఎన్నో కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. వివాహేతర  సంబంధం పెట్టుకోవడం మానవతా విలువలకు విరుద్ధమని.. చట్టరీత్యా   నేరమని తెలిసినప్పటికీ కూడా ఎవరు కూడా వివాహేతర సంబంధానికి దూరంగా ఉండటానికి ఇష్టపడటం లేదు. వెరసి నేటి రోజుల్లో జనాలు ఎంతగానో రెచ్చిపోతున్నారు అని చెప్పాలి. కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తులతో మోజులో పడిపోయి ఎన్నో దారుణాలకు కారణమవుతున్నారు. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజం మొత్తం ఉలిక్కి పడే పరిస్థితి ఏర్పడింది.


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనీ..  భర్త  కారణంగా ప్రియుడితో సుఖాన్ని పొందలేక పోతున్నా అని భావించిన భార్య చివరికి ప్రియుడితో చేతులు కలిపి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. ఇటీవలే ఏలూరు టౌన్ లోని వసంతవాడ లో ఒక వ్యక్తి దారుణ హత్య జరగ్గా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధమే హత్యకు కారణమనీ విషయం తేలింది. కాగా నిందితుడు ముళ్లపూడి దిలీప్ ను  అరెస్టు చేశారు పోలీసులు.


 పెదపాడు మండలం వసంతవాడ కు చెందిన వీర్రాజుకు ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరుగగా ఏడు నెలల బాబు ఉన్నాడు. వివాహానికి ముందు నుంచే లక్ష్మికి ఈదులగూడెం గ్రామానికి చెందిన దిలీప్ తో వివాహేతర సంబంధం ఉంది. నిత్యం ఏదో ఒక కారణం చెప్పి ఇంటికి వెళ్తూ ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉండేది. అయితే ప్రియుడితో  కలవడానికి తరచు తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అని భావించింది లక్ష్మి.. ఈ విషయం ప్రియుడికి చెప్పింది. ప్రియుడు భర్త వీర్రాజును మాయమాటలతో బయటకు తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించి దారుణంగా హత్య చేశాడు. ఈ మర్డర్ మిస్టరీని ఇటీవల పోలీసులు చేదించడం పై ఉన్నతాధికారులకు ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: