ఇటీవల భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సమయంలో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఎంతోమంది స్నేహితులు ఒకచోట చేరి ఒక పెద్ద టీవీ ఏర్పాటు చేసుకుని క్రికెట్ మ్యాచ్ లు చూడటం లాంటివి కూడా చేశారు. ఈ క్రమంలోనే టీమిండియా గెలవగానే ఎంతో మంది భారత అభిమానులు అందరూ కూడా భారీగానే సంబరాలు చేసుకున్నారు అని చెప్పాలి. ఇటీవలే ఇలా టీమిండియా గెలిచింది అని సంబరాలు చేసుకున్న ఒక వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటన కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
పాకిస్థాన్‌పై భారత జట్టు గెలిచింది అని ఆనందం లో మద్యం సేవించి రాత్రి పడుకున్న వ్యక్తి ఉదయాన్నే ఛాతి నొప్పి రావడంతో తరలించగా అప్పటికే మృతి చెందాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. కర్ణాటకకు చెందిన ప్రకాష్ నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు అంజయ్య నగర్ లోని పద్మా నిలయంలో ఎయిర్టెల్ డిటిహెచ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల భారత్ పాకిస్తాన్ మ్యాచ్ స్నేహితులతో కలిసి వీక్షించారు. తెల్లవారుజామున రెండు గంటల వరకు మద్యం తాగి పడుకున్నాడు. ఛాతిలో నొప్పి రావడంతో ప్రకాష్ నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం లేచి కాసేపు వాకింగ్ చేసి మళ్లీ ఛాతి నొప్పి వస్తుందని విశ్రాంతి తీసుకున్నాడు. ఇక అంతలోనే అపస్మారక స్థితిలోకి వెల్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి