
బ్యాండ్ బాజా లతో డీజే పాటల తో అంగరంగ వైభవం గా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు గణేష్ నిమజ్జన కార్యక్రమం లో అప శృతి చోటు చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయం లో కాస్త జాగ్రత్తగా ఉండాలని లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినప్పటికీ కొంత మంది నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. నిర్మల్ జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమం లో ఓ బాలుడు ప్రమాద వశాత్తు కాలుజారి పడి స్వర్ణ నదిలో గల్లంతయ్యాడు. జిల్లా కేంద్రం లోని ప్రియదర్శిని నగర్ కాలనీకి చెందిన 17 ఏళ్ల శ్రీహరి తన స్నేహితులతో కలిసి వినాయకుని ప్రతిష్టించుకొని నవరాత్రులు పూజలు చేశాడు. ఈ క్రమంలోనే సిద్దాపూర్ సమీపంలోగల స్వర్ణ నదిలో నిమజ్జనం చేయడానికి శోభయాత్ర గా అక్కడికి తీసుకెళ్లారు. గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా నది లో కాలు జారి పడి గల్లంతయ్యాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. అయితే కొడుకు చనిపోయాడన్న వార్త విన్న తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..