ఒకప్పుడు భారత్ అగ్రదేశాలతో పోల్చి చూస్తే టెక్నాలజీ పరంగా ఎంతో వెనకబడి ఉండేది. అలాంటి సమయంలో మూఢనమ్మకాలను నమ్మేవారు ఎక్కువమంది కనిపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అగ్ర దేశాలకు సైతం పోటీ ఇస్తూ టెక్నాలజీలో దూసుకుపోతుంది భారత్. అయితే ఇలాంటి టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలను నమ్మేవారు కనిపిస్తున్నారు అని చెప్పాలి. బురిడీ బాబాల మాటలు నమ్మి లక్షలు మోసపోతున్న వారు కొంతమంది అయితే.. చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మాంత్రికుడు దగ్గరికి వెళ్లి తాయత్తు కట్టించుకుంటున్న వారు మరి కొంతమంది.


 ఆధునిక సమాజంలో కూడా మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయి జనాలు చేసే పిచ్చి పనులు చూస్తూ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా పిల్లలకు పాఠాలు బోధించే స్కూల్ టీచర్లు ఇక టెక్నాలజీ గురించి పిల్లలకు వివరించాలి. ఇక వారి లోపల ఉన్న మూడు నమ్మకాలను రూపుమాపేందుకు ప్రయత్నించాలి. కానీ ఇక్కడ టీచర్లు అలా చేయలేదు. ఉపాధ్యాయులే మూఢనమ్మకాలపైపు అడుగులు వేశారు అని చెప్పాలి. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే ఆసుపత్రికి తరలించారూ. కానీ ఆ తర్వాతే పిచ్చి పని చేశారు. దయ్యం పట్టిందని మాంత్రికుడిని పిలిపించారు ఉపాధ్యాయులు.


 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్య ప్రాథమిక పాఠశాలలో ఇటీవల  మధ్యాహ్న భోజనం తర్వాత 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  అయితే ఉపాధ్యాయుల వెంటనే ఆ పిల్లలకు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా ప్రాణాపాయం తప్పింది. అంతటితో ఆగకుండా స్కూల్ యాజమాన్యం ఒక మాంత్రికుడిని ఏకంగా స్కూల్లోకి పిలిపించారు. పాఠశాలలో ఉండే దయ్యమే ఇక విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి కారణమంటూ ఆ తాంత్రికుడుతో ఏవేవో పూజలు చేయించడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు చెప్పాల్సిన ఉపాధ్యాయులే దయ్యం భూతం అంటూ మాంత్రికుడుని పిలిపించి పూజలు చేయించడం ఏంటి అని ఇక స్థానిక ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: