ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనుషుల ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు బంధాలకు బంధుత్వాలకు విలువ ఇచ్చిన మనిషి ఇక ఇప్పుడు వాటికి విలువ ఇవ్వకుండా నీచమైన పనులు చేస్తూ క్షణకాల సుఖం కోసం ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నాడు అని చెప్పాలి. ఇలా అక్రమ సంబంధాల కారణంగా నేటి రోజుల్లో జరుగుతున్న నేరాలు అన్ని ఇన్ని కావు.


 సభ్య సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా దారుణంగా హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని అందరూ కళ్ళారా చూస్తూ ఉన్నప్పటికీ.. ఇక ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే విషయంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. అయితే ఇటీవల కూలీ పనుల కోసం వెళ్ళిన యువకుడు ఏకంగా యజమాని భార్యపై కన్నేసి అక్రమ సంబంధానికి తెర లేపాడు. నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఈ క్రమంలోనే వీరి ఎఫ్ఫైర్ విషయం భర్తకు తెలిసింది.. దీంతో భార్యను మందలించాడు. తన దగ్గర పని చేస్తున్న యువకుడ్ని కూడా హెచ్చరించాడు.


 కానీ కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వని ఆ మహిళ దారుణానికి పాల్పడింది. ఘటన మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో వెలుగు చూసింది. రామ్ నగర్ కు చెందిన దిలీప్ అనే వ్యక్తి భార్య దుర్గాతో కలిసి ఉండగా.. మోతి ఖాడియా అనే వ్యక్తి దిలీప్ వద్ద కూలి పని చేస్తూ ఉండేవాడు. కాగా యజమాని భార్యపై కనేసి ఆమెతో అక్రమ సంబంధానికి తెర లేపాడు. అయితే ఓ రోజు దిలీప్ కు ఈ విషయం తెలిసింది. దీంతో అప్పటి నుంచి తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఇదే విషయంపై గొడవపడిన దిలీప్ భార్యపై దాడి చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు మోతి.. దిలీప్ పై కత్తితో దాడి చేసి గొంతు కోసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: