ఇటీవల కాలంలో విద్యా సంస్థల్లో ఉండే  బట్టి పట్టే చదువులు విద్యార్థులందరికీ కూడా ఎంతో భారంగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాగా చదువుకోవాలని.. గొప్ప ఉద్యోగాలు సాధించాలని ఆశ ఉన్నప్పటికీ ఇక ఉపాధ్యాయులు చెప్పేది అర్థం కాక చివరికి ఒత్తిడిలో మునిగిపోతున్నారు ఎంతో మంది యువత. తద్వారా ఇక చెప్పింది అర్థం కాక పరీక్షల్లో ఏం రాయాలో తెలియక ఫెయిల్ అవుతున్నవారు కూడా ఉన్నారు. ఇలా ఫెయిల్ అవుతాం అనే భయంతో చివరికి ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూ తనూవు చాలిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే  ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఎన్నో ఘటనలు తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగులుస్తూ ఉన్నాయ్.


 ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా ఇంటర్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల డివిజన్ దండమూడి ఎన్ క్లేవ్ లో నివాసముండే శ్రీ రామ దుర్గాప్రసాద్, అరుణ దంపతులకు 17 ఏళ్ల కుమార్తె శ్వేత ఉంది. మారేడుపల్లి లోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతుంది.


 అయితే ఇటీవల రాత్రి 9:30 గంటల సమయంలో శ్వేతతో కలిసి అరుణ బెడ్ రూమ్లో నిందించింది. కానీ మరునాడు ఉదయం చూసేసరికి మాత్రం ఇక బెడ్ రూమ్లో కుమార్తె కనిపించలేదు. అయితే స్టడీ రూమ్ లో చదువుకుంటుందని తల్లి అరుణ భావించింది. ఈ క్రమంలోనే కూతురు కోసం వెళ్లి స్టడీ రూమ్ లో చూడగా శ్వేత చున్నీతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో ఒక్కసారి ఇంకా భయపడిపోయిన తల్లి అరుణ వెంటనే భర్తకు సమాచారం అందించింది  అయితే కుటుంబ సభ్యులు యువతిని కిందికి దించి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. అయితే న్యూ ఢిల్లీ ఎయిమ్స్ లో సీటు సంపాదించాలనేది తన కుమార్తె కోరిక అని.. ఆ ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: