ఇటీవల కాలంలోఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లోనే ఉంచి చదువులు చదివిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. తమకు దగ్గరగా ఉంటే కాస్త గారాబం చేస్తారని కొంతమంది.. లేదంటే మెరుగైన విద్యా సంస్థలు తాము ఉంటున్న ప్రాంతానికి దూరంగా ఉంటున్నాయని మరి కొంతమంది ఇక కాస్త మనసుకు కష్టంగా అయినప్పటికీ కూడా తమ పిల్లలను హాస్టల్లోనే ఉంచుతూ ఇక విద్యాబోధన చేయిస్తూ ఉన్నారు.  సమయం సందర్భం దొరికినప్పుడు వెళ్లి ఇక తమ పిల్లల బాగోగులు తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు.


 అయితే ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిసిన తర్వాత మాత్రం తమ పిల్లలను హాస్టల్లో ఉంచి చదివిస్తున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడినంత పని అవుతూ ఉంది అని చెప్పాలి. ఏకంగా తమ కూతురు హాస్టల్లో ఉంటూ బాగా చదువుకుంటుంది అని సంతోషంగా ఉన్న తల్లిదండ్రులకు.. ఓ రోజు ఒక అనుకోని వార్త వినిపించింది. ఏకంగా తమ కూతురు చనిపోయింది అంటూ చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో పరిది జలవన్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. జస్రమ్ అనే వ్యక్తికి ప్రియ అనే కూతురు ఉంది. స్థానికంగా ఉన్న హాస్టల్లో ఉంటూ ఎనిమిదవ తరగతి చదువుతుంది. అయితే ఇటీవలే బాలిక హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.


 ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండె పగిలినంత పని అయింది. వెంటనే హాస్టల్కు వెళ్లి విగత జీవిగా ఉన్న కూతురును చూసి బోరున విలపించారు. ఇక ఆ తర్వాత బాలికకు సంబంధించిన బ్యాగును ఇంటికి తీసుకొచ్చి తెరిచి చూడగా తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అందులో ఓ పాంట్ పై రక్తపు మరకలు ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయి అంటూ ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలంటూ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: