నిన్నటి తరం జనరేషన్ లోనే కాదు నేటితరం జనరేషన్లో సైతం వంశోద్ధారకుడు పుట్టాలని తల్లితండ్రులు అత్తమామలు అందరూ ఆశ పడుతూ ఉంటారు. ఇక పొరపాటున కూతురు పుట్టిందంటే చాలు కాస్త అసంతృప్తి చెందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎవరైతే ఏంటి అని యాక్సెప్ట్ చేసేవారు కొంతమంది అయితే.. కూతురు పుట్టిందని కోపంతో భార్యను చిత్రహింసలకు గురి చేసే భర్తలు కొంతమంది. కానీ ఇక్కడ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఒక ఘటన జరిగింది. కూతురు పుట్టిందని ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అయితే తండ్రి పోలికలతో పుట్టింది అని అక్కడికి వచ్చి ఆ శిశువును చూసిన వారందరూ కూడా చెబుతూ ఉంటే తండ్రి ఆనందం పట్టలేని విధంగా మారిపోయింది. కానీ ఎందుకో ఈ విషయం ఆ తల్లికి నచ్చలేదు. దీంతో ఏ తల్లి చేయని పని చేసింది. ఏకంగా దారుణంగా కూతురుని చంపేసింది. మహారాష్ట్రలోని నాసిక్ పరిధి గంగాపూర్ శివారు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పాలి. స్థానికంగా నివాసం ఉంటున్న భార్యాభర్తలు ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం పరితపించేవారు. ఇటీవలే మహిళ గర్భం దాల్చగా భర్త, అత్తమామలు కూడా సంతోషంలో మునిగిపోయారు. కోడలు ఆడపిల్ల జన్మనివ్వడంతో మహాలక్ష్మి మా ఇంటికి నడిచి వస్తుందని ఎంతగానో ఆనందపడ్డారు. ఇక పాపను చూడ్డానికి వచ్చిన వారంతా అచ్చం తండ్రిలాగే ఉంది అంటూ ఉండడంతో ఇక వారి ఆనందం మరింత రెట్టింపు అయింది. ఇలా బంధువులందరూ అంటూ ఉంటే భర్త ఎంతో మురిసిపోయాడు. అయితే భర్త పోలికలతో పుట్టడం మాత్రం భార్యకు నచ్చలేదు. కూతురు పుట్టినప్పటినుంచి ఇదే ఆలోచనతో నిత్యం అసంతృప్తితో ఉండేది తల్లి. చూస్తుండగానే పాపకి మూడు నెలల వయసు వచ్చింది. కానీ తల్లి మనసులో ఆ ఆలోచన మాత్రం పోలేదు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆ తల్లి ఇంట్లో ఎవరు లేని సమయంలో కూతురు గొంతు నులిమి హత్య చేసింది. ఇక ఎవరో తన కూతురుని చంపేశారు అంటూ నాటకం మొదలుపెట్టింది. పోలీసులు రంగంలోకి తిరిగి తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: