నూతన బిల్డింగ్ కోసం 2018లో ఐకాసగా తాము 100 రోజుల పాటు నిరసనలు చేపడితే... 800 కోట్లతో ట్విన్ టవర్స్ నిర్మిస్తామని అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హామీని ఇచ్చినట్లు జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ గుర్తు చేశారు. 5 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ విమర్శించారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని దాటివేత ధోరణి అవలంభిస్తుందని జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ మండిపడ్డారు.
ఈ కేసు విషయంపై ఒక వారం రోజుల్లో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని ఆరోగ్య శాఖ హరీష్ రావు తెలిపినట్లు జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ వివరించారు. పాత బిల్డింగ్ కూల్చి కొత్త బిల్డింగ్ కట్టాలని జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ డిమాండ్ చేశారు. లేకపోతే హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న 7 ఎకరాల భూమిలో అయిన కొత్త బిల్డింగ్ కట్టాలని జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ డిమాండ్ చేశారు.
ప్రతియేటా 250 మంది ఎంబీబీఎస్, 700 మంది పీజీ మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారని జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ వివరించారు. వారికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొత్త భవనానికి సంబంధించి బడ్జెట్ కేటాయించి శంకుస్థాపన చేయాలని జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ డిమాండ్ చేశారు. చూడాలి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి