భారత రాజ్యాంగం భారతీయ పౌరులందరికీ సమాన హక్కుల కల్పించింది. ఆ హక్కులకు భంగం కలగకుండా కాపాడటమే న్యాయ వ్యవస్థ విధి. హక్కులకు నష్టం, కష్టం వచ్చిన సమయంలో వాటిని సరిచేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థదే. అందుకే రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు స్వయం ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది. న్యాయ వ్యవస్థ లో జరిగే ఆలస్యం కారణంగా ఆ వ్యక్తి హక్కు కి, ప్రతిష్ఠకు భంగం కలిగితే అతను ఇంకెక్కడికి వెళ్తాడు.


చంద్రబాబు విషయంలో అదే జరుగుతుంది అనిపిస్తుంది. 17 ఏ ప్రకారం రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబును రిమాండ్ కు తరలించారు.. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు కాబట్టి ఆయన్ను తక్షణం విడిచి పెట్టాలని హై కోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు.  దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదిస్తుండటంతో ఆయన ఏ పాయింట్ లేకుండా కేసును వాదించరు అని టీడీపీ నేతలు నమ్మారు.


ఇప్పుడు చంద్రబాబు చేసింది తప్పు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాటించకపోతే తీర్పు ఆలస్యం అయ్యే ప్రతిరోజు ఆయన హక్కుకు భంగం కలిగినట్లే కదా. ఒప్పు అయితే ప్రభుత్వ హక్కు కాపాడిన వారవుతారు. కింది కోర్టులకు అనుమతి ఇచ్చి చంద్రబాబును కస్టడీకి ఇస్తే విచారించవచ్చు.  కానీ అనుమతి ఎందుక ఇవ్వడం లేదు అంటే హైకోర్టులో క్వాష్ ఉంది కాబట్టి.


దీనివల్ల విచారించే అవకాశాన్ని సీఐడీ కోల్పోతుంది. అయిదు రోజుల విచారణ అప్పుడు అలాంటి హక్కును కోల్పోతుంది సీఐడీ.  చంద్రబాబు ది కరెక్టే అయితే జైలులో పెట్టి ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించినట్లే కదా. అందుకే న్యాయం సత్వరం కావాలి. అలాగని న్యాయమూర్తులను తప్పు పట్టడం లేదు. వారికి విపరీతమైన పనిభారం ఉంటుంది. రిమాండ్ రిపోర్టు ఒక 500 పేజీలు ఇస్తే దానికి కౌంటర్ గా వారు మరో 900 పేజీల రిపోర్టును ఇస్తారు. ఇవన్నీ చదివి ప్రతి దానికి జవాబు ఇవ్వాలి కాబట్టి ఆలస్యం అవుతోంది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: