ఎప్పుడూ తనదైన ధరణితో తప్పును విమర్శించేటువంటి ఉండవల్లి, ఇప్పుడు అలా విమర్శించినందుకే అవతలి వాళ్ళకి టార్గెట్ అవబోతున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇసుక, లిక్కర్ కుంభకోణాలు మీకు కనిపించవా అంటూ కొత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్లకి సంబంధించిన ఇష్యూను హైలెట్ చేసుకుంటూ వస్తున్నారు ఉండవల్లి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎవరో రాసిన పిటిషన్ పై మీరు ఎలా సంతకం చేసారు అంటూ మాజీ ఎంపీ అరుణ్ కుమార్ ని కూడా నిలదీశారు ఉండవల్లి.


ఇలా నిలదీయడంతో అవతలి పార్టీ వాళ్ళు ఉండవల్లి వ్యక్తిత్వాన్ని, అలాగే ఉండవల్లి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాలను వ్యక్తిగతంగా విమర్శించడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తుంది. దీనికి నిదర్శనంగా మేము ఉండవల్లిని టార్గెట్ చేయబోతున్నాం అంటూ వాళ్ల సోషల్ మీడియా పోస్టుల ద్వారానే వాళ్ళు తెలియజేసిన సందర్భం ఇప్పుడు. అయితే ఇలా అడగడంలో, విమర్శించడంలో తప్పులేదు కానీ చంద్రబాబునాయుడు జగన్ అరెస్ట్ అయిన సందర్భంగా గతంలో ఎందుకు ఇంప్లిడ్ అయ్యారు.


అలానే ఎర్రంనాయుడు, అశోక్ గజపతిరాజు ఎందుకు ఇంప్లిడ్ అయ్యారు వాళ్లకి ఏంటి సంబంధం అనే ప్రసక్తి లేదు ఇక్కడ. రామోజీరావు అంశంపై గతంలో ఉండవల్లి స్పందించినప్పుడే ఆయన తెలుగుదేశం వాళ్ళకి టార్గెట్ అయ్యారని అంటారు. చంద్రబాబు అరెస్టు విషయంలో సిబిఐ విచారణ  జరుగుతున్న ఈ సందర్భంలో ఉండవల్లి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరికొన్ని కొత్త ఇష్యూలను ఎత్తడం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నచ్చడం లేదు అని అంటున్నారు.


దాంతో వాళ్లు ఉండవల్లి పై తమ ఆగ్రహాన్ని ఇలా టార్గెట్ చేయడం ద్వారా వ్యక్తీకరిస్తారని అంటున్నారు. ఉండవల్లి అమ్ముడుపోయాడని, జగన్మోహన్ రెడ్డి ఆయనకు సూట్ కేసులు అందిస్తున్నారని మొదలుపెడతారు.  ఉండవల్లి కుటుంబ సభ్యులను పేరు పేరునా హైలెట్ చేసి విమర్శించడం మొదలు పెడతారు. మీ భార్య ఇలాంటిదని, నీ కొడుకు ఇలాంటి వాడని, నీ కూతురు ఇలాంటిదని వాళ్లపై రకరకాలుగా టార్గెట్ చేసుకుంటూ వస్తారు. ఉండవల్లి దీనికి ఎలా ప్రిపేర్ అవుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: