తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. హోరా హోరీగా సాగిన ప్రచారం ముగిసింది. ఫలితం తేల్చే పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య  నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో పలు సర్వేలు వెల్లడించే ఫలితాలు చేతులు మారుతూ ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్తున్నాయి. తాజాగా సౌత్ ఫస్ట్ సర్వే తెలంగాణ ఫలితాలపై తమ అంచనాను విడుదల చేసింది.


సర్వే సంస్థ విడుదల చేసిన ఫలితాల్లో కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సంస్థతో కలిసి పనిచేసిన ఈ సర్వే  సంస్థ అధికార బీఆర్ఎస్ కంటే ఓట్ల శాతంలోను, సీట్ల శాతంలోను కాంగ్రెస్ తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నట్లు తెలిపింది. నవంబరు 15 నుంచి 25 వరకు చేసిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే స్త్రీలు ముఖ్యంగా గృహిణులు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని పేర్కొంది.  అయితే మహిళల మొగ్గులో రెండు పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమేనని తెలిపింది. పురుషుల్లో అత్యధిక శాతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంచనా వేసింది. పురుషుల సంఖ్యలో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 11శాతం ఉన్నట్లు వివరించింది.


ఇక సీట్ల విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ 57-62 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. బీఆర్ఎస్ 41-46 సీట్లకు పరిమితం కానుందని. బీజేపీకి 3-6 సీట్లు, ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థ అభిప్రాయపడింది. బీఆర్ఎస్ కంటే 4శాతం ఓట్లు హస్తం పార్టీ గెలుచుకుంటుందని వెల్లడించింది. 2018 ఎన్నికల సమయంలో ఈ సర్వే సంస్థ బీఆర్ఎస్ కు 88, కాంగ్రెస్ కు 19, బీజేపీకి 1 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. దాదాపుగా అవే ఫలితాలు పునరావృతమయ్యాయి. చూద్దాం ఈ సారి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: