తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లోనూ ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టబోతున్నారు. వాస్తవానికి ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉంది. కానీ.. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయంతో ఇక తెలుగు మీడియం ఉండదు.. పూర్తిగా ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం జరిగిపోయింది. దీని కోసం ఏకంగా ఓ చట్టం కూడా చేయబోతున్నారు. 



ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. అయితే... ఈ నిర్ణయం కొత్తదేమీ కాదు.. ఏపీలో సీఎం జగన్ అధికారానికి వచ్చిన కొత్తలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు జగన్ నిర్ణయంపై చాలా వ్యతిరేకత వచ్చింది. తెలుగు బాషాభిమానులం అని చెప్పుకునే వాళ్లంతా గుండెలు బాదుకున్నారు. జగన్ తెలుగును చంపేస్తున్నాడన్నారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్ కూడా  అనూహ్యంగా అదే నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే.. జగన్ నిర్ణయాన్ని కేసీఆర్ ఫాలో అయ్యారు. 



ఇప్పుడు కేసీఆర్ కూడా జగన్ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో గతంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది. జగన్ తీసుకున్నది అక్షరాలా మంచి నిర్ణయమని.. అందుకే ఇప్పుడు పొరుగున ఉన్న కేసీఆర్ కూడా ఆయన్ను ఫాలో అవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. మంచి ఫలితాలు ఎక్కడ వచ్చినా దాన్ని ఫాలో కావడంలో ఏమాత్రం తప్పలేదు. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నది ఇదే. 



గతంలో జగన్ చేస్తున్నది తప్పు అని విమర్శించిన వాళ్లు ఇప్పుడు కేసీఆర్ కూడా అదే బాట పట్టడంతో ఏం మాట్లాడతారో చూడాలి. మొత్తానికి కేసీఆర్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో జగన్‌ కు క్రేజ్ పెరిగింది. చూశారా.. మా జగన్ ఎప్పుడో చేశారు.. ఇప్పుడు మీ కేసీఆర్ దాన్ని ఫాలో అవుతున్నాడు అంటూ వైసీపీ నేతలు తమకు పరిచయస్తులైన టీఆర్ఎస్ నేతలతో చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: