ఏపీలో ఇప్పుడు లీకుల రాజ్యం నడుస్తోంది. పదో తరగతి పరీక్షల్లో రోజూ పేపర్ బయటకు వస్తూనే ఉంది. ఈ లీకుల పర్వంపై మీడియాలోనూ జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. పదో తరగతి పేపర్ లీక్ కావడంలో ఓ ప్రత్యేకత ఉంది. ఎక్కడా కూడా పేపర్ ముందుగా బయటకు రావడం లేదు. పరీక్ష మొదలయ్యాక అప్పుడు వాట్సప్ ద్వారా పేపర్ బయటకు వస్తోంది. కొన్ని కేంద్రాల్లో ఈ పేపర్ ఆధారంగా జవాబు పత్రాలు తయారు చేసి విద్యార్థులకు కాపీ కొట్టుకునేందుకు సిద్ధం చేస్తున్నారు.


అయితే.. గతంలోనూ ఏపీలో ఎన్నోసార్లు పరీక్షలు జరిగినా ఇంతగా పదో తరగతి పరీక్షలు ఇంతగా బద్‌నాం కాలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది. దీనిపై పరిశీలన చేస్తే అసలు విషయాలు అర్థం అవుతాయి. గతంలో చంద్రబాబు హయాంలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు సంస్థలు ఇలాగే ఏటా పేపర్ లీకేజ్ చేసేవని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ అంశాలపై అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు.


టీడీపీ హయాంలో మంత్రులకు సంబంధించిన పాఠశాలల్లోనే ఇలాంటి దారుణాలు జరిగాయని.. అప్పట్లో అధికారం చేతిలో ఉండటం వల్ల వాటిని విద్యాశాఖ అధికారులు కూడా పట్టించుకోలేదని.. అందుకే లీకేజీల గురుంచి అప్పట్లో రచ్చ కాలేదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవడం వల్లే ఇప్పుడు చంద్రబాబు అనుకూల మీడియాతో రచ్చ చేయిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.


ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వం లీకేజీ ఆరోపణలపై విచారణ జరిపించి మొత్తం 60 మందిపై క్రిమినల్‌ కేసులు పెట్టించింది. ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయని తెలియగానే పోలీసు సిబ్బందిని కూడా ఇన్‌వాల్వ్‌ చేస్తోంది. అరెస్టు చేసిన 60 మందిలో 36 మంది టీచర్లు, మరో ఇద్దరు ఆఫీస్‌ స్టాఫ్‌ కూడా ఉన్నారు. నారాయణ, చైతన్య వంటి ప్రైవేటు విద్యా సంస్థలు  22 మంది కూడా ఉన్నారు. అరెస్టయిన వారిలో నారాయణ సంస్థ వైస్‌ ప్రిన్సిపల్‌ కూడా ఉండటం విశేషం. గతంలో ఏనాడూ జరగని విధంగా క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: